తల్లి, తండ్రి పేరు మీద స్కూల్ విద్యార్థులకు
నోట్ బుక్స్ లు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్. వి అంజయ్య

viswatelangana.com
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలోని యు.పి.ఎస్ పాఠశాలను గ్రామస్తులు కలిసి కాపాడుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ అంజయ్య. అన్నారు. గ్రామంలో ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఉన్న విద్యార్థిని, విద్యార్థులు అందరూ. తప్పకుండా సర్కార్ బడిలోనే చదివేల శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులందరికీ నోట్ బుక్ ల పంపిణీ చేసినట్లు. అంజయ్య తెలిపారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ. అవగాహన ఏర్పాటు చేసి, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను కల్లూరు గ్రామానికి చెందిన విద్యార్థులను ఏడవ తరగతి వరకు ఎవరికి అడ్మిషన్ ఇవ్వరాదని, అలాగే ప్రైవేట్ పాఠశాలలు ప్రచారం కూడా చేయరాదని, గ్రామస్తులందరం తీర్మానం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరహరి, రాజేష్, శివ, లత, కార్యదర్శి, ప్రశాంత్, మరో ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, గ్రామంలోని యువకులు పుర ప్రముఖులు, విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.



