కథలాపూర్ మండలంలో మద్యం మూడు ఫుల్లులు – ఆరు హాఫు లు

viswatelangana.com
కథలాపూర్ లో మద్యం మాఫియా మూడు ఫుల్లులు ఆరు హాఫులుగా సాగుతున్నది. వైన్స్ నిర్వాహకులు సిండికేట్‌గా మారి మద్యాన్ని వైన్స్‌షాపుల్లో ఉంచడం లేదు.కొన్ని కంపెనీలకు చెందిన ఎక్కువగా అమ్ముడు పోతున్న మద్యాన్ని దొంగచాటున బెల్టుషాపులకు అమ్ముతూ అక్రమ దందాకు తెరలేపారు. ఫలితంగా మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.
కథలాపూర్ లో మద్యం మాఫియా రెచ్చిపోతున్నది…
మద్యం నిర్వహకులంతా కలిసి సిండికేట్ గా మారారు. మద్యం దుకాణాల్లో ఉంచాల్సిన పలు బ్రాండ్లను గుట్టుగా బెల్టుషాపులకు అమ్ముతున్నారు.వైన్‌షాపు నిర్వాహకుల తీరుతో మందుబాబుల జేబులకు చిల్లు పడుతున్నది.కథలాపూర్ మండలంలోని మొత్తం 3 వైన్ షాపులు ఉన్నాయి. వేర్వేరు టెండర్ల ద్వారా పర్మిట్లు దక్కించుకున్నారు. బెల్టుషాపులు నడిపేవాళ్ళు మందుబాబులకు ఎమ్మార్పి రేటుకు అదనంగా క్వాటర్ మందు రూ.20, బీర్లకు రూ.20 అదనంగా అమ్ముతున్నారు.
ప్రతి గ్రామానికి బెల్టుషాపులు..
కథలాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు బార్లా తెరిచి ఉన్నారు. ప్రతి గ్రామంలో మూడు, నాలుగు బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యాన్ని నేరుగా కౌంటర్ల ముందు విక్రయిస్తున్నారు. అటుగా వచ్చి పోయే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి యువత కౌంటర్ల ముందే తాగడంతో వృద్ధులు, మహిళలు అసహనానికి గురవుతున్నారు.
‘బెల్టు’తీసేదెవరు?
బెల్ట్‌షాపుల్లో విచ్చలవిడిగా మందు విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. వైన్స్ లో దొరకని మాలు బెల్ట్ షాపుల్లో ఎలా ఉంటుందని బెల్టు షాపులపై పోలీసు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సినా పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలకు తావునిస్తున్నది. బెల్టు షాపులపై తనిఖీ చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు శాఖలకు ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి మద్యం దందాకు తెరదించాల్సిన అవసరం ఉంది అంటున్న మద్యం ప్రియులు



