కొడిమ్యాల
జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు

viswatelangana.com
January 25th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవంఘనంగా నిర్వహించారు. అధ్యాకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులతో కలిసి జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, జరగబోయే ఎన్నికల్లో విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు ముందు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి. తిరుపతి, అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



