తుర్తి యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి

viswatelangana.com
కథలాపూర్ మండలంలోని తుర్తి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు తుర్తి యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ యోగ వేదాలను, శాస్త్రాలను తన ఉపన్యాసాలు, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉందని గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్లి హిందూ మతం గొప్పతనం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడని వివేకానందుని పూర్తి పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన జనవరి 12 వ తేదీ 1863 న కలకత్తాలోని బెంగాల్ ప్రెసిడెన్సి లో జన్మించాడని అనుభవం ఒక ఉత్తమ గురువు విజయం కలిగిందని విర్ర వీగకు. అపజయం కలిగిందని నిరాశ పడకు.విజయం ఏమి అంతం కాదు.అపజయం తుది మెట్టు కాదు. ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే. ప్రయత్నించి ఓడిపోవడం మేలు అని ఎన్నో సూక్తులను చెప్పారు భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి వివేకానందునికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణి చేశారు నూతనంగా ఏర్పరిచిన తుర్తి యూత్ సభ్యులు వివేకానందుని స్ఫూర్తి గా తీసుకొని వారి మార్గంలో నడుస్తామని యూత్ సభ్యులు తెలిపారు.



