రాయికల్
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు

viswatelangana.com
March 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలోని బాలుర పాఠశాలలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 250 మందికి కంటి పరీక్షలు చేయగా మొదటి బస్సులో 45 మందికి కంటి ఆపరేషన్ కోసం సోమవారం పంపగా మళ్ళీ బుధవారం రోజు 50 మందిని కంటి ఆపరేషన్లు కు పంపడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఇప్పటివరకు లయన్స్ క్లబ్ సుమారు 2000 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.



