కోరుట్ల

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చేస్తున్న పాదయాత్రకు మద్దతు

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

October 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు జరిగిన పోరాటంలో ఉద్యమకారుల పాత్ర మరవలేనిదని ఎంతో మంది ప్రాణ త్యాగాలు, అరెస్టులు, లాఠీచార్జీలు, దాడులు, జైలు జీవితాలను సైతం ఎదిరించి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ నేత, న్యాయవాది దాసర్ల శ్రీశైలం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అదిలాబాద్ నుండి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వరకు చేస్తున్న పాదయాత్రకు పేట భాస్కర్ మద్దతు తెలిపారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ఈనెల 15 నుండి 29 వరకు దాసర్ల శ్రీశైలం చేస్తున్న పాదయాత్ర అభినందనీయమని ఉద్యమకారుల పక్షాన గళం విప్పి చేస్తున్న త్యాగం వృధా పోదన్నారు. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లభించలేదని తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన హామీల మేరకు వారిని గుర్తించి 250 గజాల ఇండ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్యాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు రుణపడి వుంటారని పేట భాస్కర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు కృష్ణ ముదిరాజ్, కేతురి శివన్న, గుండెటి రవి, శాలివాహన బాలచందర్, పద్మ నరేష్, శ్రీనివాసులు, పెందురి మారుతి, మామిళ్ల లక్ష్మణ్, పాలకొండ దత్తు, అత్రం వినోద్, దాసరి విల్లాస్, దుర్గం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button