viswatelangana.com
Date of Publish : 14 February 2024, 4:11 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం
featured

కోరుట్ల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరుగని పోరాటాల ద్వారా ఉద్యమాలు నిర్వహించి స్వరాష్ట్రం సాదించిన ఉద్యమాకారులతో కలిసి ఈనెల 17న హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్ట్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తెలిపారు. బుధవారం కోరుట్లలోని తన కార్యాలయంలో పాత్రికేయులతో పేట భాస్కర్ మాట్లాడుతూ సాదించుకున్న తెలంగాణలో గత పాలకులు ఉద్యమకారులను విస్మరించారని వ్యతిరేకులకు అందలం ఎక్కించారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను అదుకుంటామని రెండు వందల యాబై గజల ఇంటి స్థలంతో పాటు నిర్మాణం చేయిస్తామని ప్రజాపాలనలో సైతం అప్స్న్ ఇచ్చారని ఇలాంటి అనేక అంశాలపై టిపిఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం అధ్యక్షతన చర్చించే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పేట భాస్కర్ ఉద్యమకారులను కోరారు.

Change News Type