హైదరాబాద్
తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్ గా రాధాకృష్ణన్?

viswatelangana.com
June 27th, 2024
హైదరాబాద్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. అలాగే తెలంగాణ, పుదుచ్చేరికి కూడా ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. తనను తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్ గా కొనసాగించాలని ఇటీవల హోంమంత్రి అమిత్ షాను ఆయన కోరారు. త్వరలోనే రాష్ట్రపతికి సిఫార్సు చేస్తామని హోంమంత్రి ఆయనతో చెప్పినట్లు సమాచారం.



