రాయికల్

తెలంగాణ రాయికల్ మండల గౌడ సంఘం జిల్లా జగిత్యాల పత్రిక ప్రకటన

viswatelangana.com

March 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండల గౌరవనీయులైన పత్రిక సోదరులకు తెలియజేయునది ఎమనగా మేము రాయికల్ మండల గౌడ సంఘం సభ్యులు గౌడ సంఘం అధ్యక్షులు మరియు గౌడ సంఘనికి సంబందించిన సభ్యులు పెద్ద మనుషులు అందరం కలిసి అత్యవసర సమవేశం, అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ జరిగింది. 19-3-202 మంగళవారం రోజున జిల్లా కేంద్రం జగిత్యాలలో రాయికల్ మండల నూతన సంఘం కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు డా॥ చంద్ర శేఖర్ సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.రాయికల్ మండలానికి చెందిన అన్ని గ్రామల సభ్యులు అందరం కలిసి 20 సంవత్సరాలుగా నడుస్తున్న సంఘం మాది. గత 2 సంవత్సరముల క్రితం మా సంఘం నుండి కొందరు సభ్యులు విడిపోయి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం మరో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు . మాకు వారి పట్ల ఎలాంటి సమస్యలు గాని విభేదాలు గాని లేవు వారి సంఘం కు మా సంఘం కు ఎలాంటి సంబధం లేదు. మేము మా గౌడ సంఘం తరుపున అనేక సార్లు ఆపదలో ఉన్న గౌడ కుల బందవులను అదుకున్నాము. గాయపడిన వారికి తగిన పారితోషకం మరియు ప్రభుత్వ సహాయం మా సంఘంసభ్యుల సహాయం ఇప్పించడం జరిగినది. మండలంలో 14 గ్రామాలలో ఉన్నటువంటి గౌడ కుల సంఘాల మద్దతు అత్యధిక మెజార్టీ మాకే ఉండడం వలన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మా కమిటీని బలపరుస్తూ తీర్మానించడం జరిగిందని తెలిపారు. నిబద్ధతతో పని చేస్తున్న మాపై విమర్శలు మనుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉత్కం సాయ గౌడ్,కొత్త కొండ లింగం గౌడ్, నాగుల మల్లయ్య గౌడ్, బొంగోని భుమగౌడ్, జోగిన పెల్లి తిరుపతి , అల్లకొండ స్వామిగౌడ్, అల్లకొండ సాయ గౌడ్, ముత్తయ్య, వెంకన్న పాలకుర్తి రవి, బత్తిన రాజేశం, అనుపురం శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, రాజ్ గౌడ్, శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button