viswatelangana.com
Date of Publish : 08 October 2024, 1:22 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
తెలంగాణ రాష్ట్ర జూనియర్ సివిల్‌ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా గోనె రాజేష్ ఖన్నా

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గోనె రాజేష్ ఖన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిసింట్ గవర్నమెంట్ ఫ్లీడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోరుట్ల పట్టణానికి చెందిన రాజేష్ కన్నా 2008లో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి, పలు సివిల్ క్రిమినల్ కేసులు వాదించారు. మూడు సంవత్సరాలు గవర్నమెంట్ తరపున పలు సివిల్ కేసులు వాదించారు. తన నియమాకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ రావు, ధర్మపురి దేవస్థాన మాజీ చైర్మన్ కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, లీగల్ ఇంచార్జ్ కస్తూరి రమేష్, మండల అధ్యక్షులు రాజం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, న్యాయవాద మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Change News Type