మెట్ పల్లి

తెలుగు భాషా దినోత్సవం వేడుకలు

viswatelangana.com

August 30th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన “తెలుగు భాషా దినోత్సవం ” మరియు “జాతీయ క్రీడా దినోత్సవంను” ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మాతృభాష అతి ముఖ్యమైనదని గొప్ప గొప్ప కవులు రచయితలు అందించిన తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ, గిడుగు రామ్మూర్తి గ్రాంథిక భాష నుండి ఎన్నో గ్రంథాలను వ్యవహారిక భాషలోకి మార్చారని కొనియాడారు. అదేవిధంగా హాకీ క్రీడాకారుడు ద్యాన్ చందు క్రీడా విశేషాలను క్రీడలకు ఉన్న గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం కళాశాల తెలుగు అధ్యాపకురాలు మహేశ్వరిని, కళాశాల క్రీడల ఇంచార్జి సుదర్శన్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ అధ్యాపకులు శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య రాజేశ్వరరావు, సుదర్శన్, ప్రతిభ మంజుల, స్వర్ణలత మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button