కోరుట్ల
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
May 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
- వారంతా కళాశాల స్నేహితులు
- ఒకే చోట చదువుకున్నారు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో డిగ్రీ పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరి కొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. కోరుట్ల డిగ్రీ కళాశాలలో 2005 – 2008 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం కళాశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఒకే చోట చేరడంతో కళాశాల ఆవరణలో సందడి నెలకొంది. ఇకనుంచి టచ్ లో ఉండాలంటూ ఒకరి నొకరు ఫోన్ నెంబర్లు మార్చుకోవడంతోపాటు ఈ మదర జ్ఞాపకాలను తమ తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు.



