దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టంపై గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనీ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని అనేకమంది దివ్యాంగులు ఉన్నప్పటికీని వారి యొక్క హక్కులను పొందుకోలేకపోతున్నారు. పిడబ్ల్యుడి ఆక్ట్ 2016 ప్రకారం దివ్యాంగుల శ్రేయస్సుకై అభివృద్ధికై ప్రభుత్వం అందిస్తున్న దివ్యాంగుల పథకాల విషయంలో చట్టాల విషయంలో అవగాహన లేనందున ముఖ్యంగా గ్రామాల్లోని దివ్యాంగులు దయనీయ జీవనాన్ని కొనసాగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనిపైన మహిళా స్వశక్తి సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో సమన్వయంతో ఆలోచించి సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో మండలాల్లో దివ్యాంగుల కొరకై స్వశక్తి గ్రూపులను ఏర్పాటు చేసి నిర్వహణ కొనసాగించాలి దివ్యాంగులు కేవలం ప్రభుత్వము అందించే పెన్షన్ మాత్రమే ఉపయోగించుకుంటూ వారి హక్కులను గురించి పథకాలను గురించి ఆలోచించలేకపోతున్నారు, అంతేకాకుండా పట్టణాల్లో ఉన్న ఆలోచనపరులైన దివ్యాంగులు మాత్రమే వివిధ పథకాల్లో లబ్ధిని పొందుకుంటున్నారు గ్రామాల్లోని దివ్యాంగులకు పథకాల గురించి అవగాహన లేనందున వినియోగించుకోలేకపోతున్నారు కావున ప్రభుత్వం ఆయా గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు దివ్యాంగుల హక్కుల పైన చట్టాల పైన పథకాల పైన అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వారి యొక్క విన్నపాలను సలహాలను సూచనలను ఆలోచించి అమలు పరచడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందించే విధంగా ప్రోత్సహించి దివ్యాంగుల అభ్యున్నతికై కృషి చేయాలి కేవలం డిసెంబర్ 23న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిపి కార్యక్రమాన్ని చేపట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రతినెల గ్రామాల్లో ప్రత్యేకంగా సదస్సులను ఏర్పాటు చేసి అవగాహనలు కల్పించాలి దివ్యాంగుల చట్టాలు పథకాలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల దివ్యాంగులకు అమలయ్యేలా చూడాలని సామూహిక కార్యకర్త. ఎలకుర్తి కిరణ్, తెలిపారు.



