కోరుట్ల పట్టణంలోని ప్లాస్టిక్ ఏజెన్సీలు అలాగే కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని 6 వేల రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దీనిని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ… సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధించాలని అలాగే దుకాణదారులందరూ, పట్టణ ప్రజలు సహకరించాలని కోరరు అలాగే దుకాణదారులందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అని తెలిపారు.