కోరుట్ల

దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ ను జయప్రదం చేయండి సదస్సు వాల్ పోస్టర్ విడుదల

viswatelangana.com

February 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల ప్రతినిధి : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈనెల 16న దేశవ్యాప్త సమ్మె భారత్ బందును విజయ వంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు అన్నారు కోరుట్ల డివిజన్లోని మున్సిపల్ కార్మికులతో సన్నాహక సదస్సు వాల్పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచిన దేశంలోని ప్రజలకు రైతులకు కార్మిక వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తుందన్నారు. కనీస వేతనాలజీవోలు లేవు ఎనిమిది గంటల పనికి బదులుగా 12 గంటలు పెంచి సాధారణ సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈపీఎఫ్ బోర్డు నుండి కనీస పెన్షన్ 10000 పెంచాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ విడుతలవారీగా పేర్మినెంట్ చేయాలని మున్సిపాలిటీలో టాక్స్లు వసూలుకు సంబంధం లేకుండా స్పెషల్ ఫ్రెండ్ ఇచ్చే ప్రభుత్వం వేతనాలు ప్రతినెల ఐదులోగా ఇవ్వాలన్నారు కేంద్ర ప్రభుత్వంరైతుల సమస్యలు పరిష్కరించాలని తరచూ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ లపైన జిఎస్టి తగ్గించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని అన్నారుపై పేర్కొన్న సమస్యలపై కార్మికులు ప్రజానికం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ రాజు సాయిలు నరసింహులు గంగారం సుగుణ నవీన్ రమేష్ గంగు రవి తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button