విస్తరణ సలహా సంఘ సమావేశం

viswatelangana.com
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశంలో వానకాలం యాసంగి 2024-25 కార్యక్రమం మార్చ్ 27, 28 తేదీలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాసలో నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు వారి పండించిన పంటలపై వారికి ఉన్న సమస్యల పరిస్కారం పెట్టుబడి తగ్గించి ఎక్కువ లాభాలను ఏవిధంగా శాస్రవేత్తలు సమకూర్చుకోవచ్చు అని వివరించారు. ఈ సందర్భంగా పది జిల్లా లలో పది మంది రైతులకు ఘనంగా సన్మానించారు. అందులో జగిత్యాల జిల్లా నుండి రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఓరుగంటి భీమ రాజ్ ను ఉత్తమ రైతుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఎడిఆర్ డాక్టర్ జి శ్రీనివాస్, అల్లీపూర్ దత్తత గ్రామ ఇన్చార్జ్ డాక్టర్ డి ఏ రజనీ దేవి ఆర్థిక శాస్త్రవేత్త, పొలాస శాస్త్రవేత్త ల బృందం అల్లీపూర్ ఎఫ్ ఇ ఒ అధ్యక్షులు అత్తినేని శంకర్, రైతులు ఓరుగంటి రాజలింగం, ఓరుగంటి రాజు, ఎల్లేశ్వరం శేఖర్, గొల్లపెల్లి అంజయ్యతదితరులు పాల్గొన్నారు.



