కొడిమ్యాల
ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని ఇద్దరు యువకులు మృతి

viswatelangana.com
July 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా వెళ్తూ నలగొండ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొనడగా ఇద్దరి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినారు. మృతుల యొక్క వివరాలు. జడ గణేష్ s/o సోమయ్య, 22 సంవత్సరాలు, దయ్యాల రాజు s/o మల్లేశం 25 సంవత్సరాలువ్యక్తులుగా తెలిసినది. విషయమై కొడిమ్యాల ఎస్సై సౌధం సందీప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగినది.



