viswatelangana.com
Date of Publish : 01 May 2025, 2:12 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ధాన్యం ఇంకెప్పుడు కొంటరు

వరి కోతలు ప్రారంభమై నెల రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదంటూ రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఉప్పుమడుగు వద్ద గురువారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ……ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసి ధాన్యాన్ని ధోబి ఘాట్ వద్ద కుప్పలు పోసి చాలా రోజులవుతున్న అధికారులు ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని మండి పడ్డారు. అకాల వర్షాలు పడి ధాన్యం తడుస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోయారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి జిల్లా సహకార అధికారి సిహెచ్.మనోజ్ కుమార్, తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యూం లు చేరుకొని రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపి ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పుమడుగు ఫ్యాక్స్ చైర్మన్ దీటి రాజరెడ్డి, వైస్ చైర్మన్ దుంపల స్వామిరెడ్డి, రైతులు దిండిగాల రామస్వామి, మాద రాజేశం, ముక్కెర నరేష్, మల్లీక్ అహ్మద్, వెంకటేష్, మహిపాల్, గంగాధర్, ఇస్మాయిల్,పల్లి మల్లయ్య, రాయమల్లు, భూమయ్య ముత్యాలు,అంజయ్య, నర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Change News Type