కోరుట్ల

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు గుర్తుగా ‘తెలంగాణ రత్న’ అవార్డుతో ప్రభుత్వం గౌరవించాలి

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో మూడు తరాల ఉద్యమ స్పూర్తి ప్రదాత స్వతంత్ర సమరయోధులు నిస్వార్థ త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు గుర్తుగా ఆయన జయంతోత్సవాలను పురష్కరించుకొని జాతీయ స్థాయిలో ఇచ్చే భారత రత్న అవార్డుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రత్న అవార్డు నెలకొల్పి మొదటి అవార్డు బాపూజీ కి ఇచ్చి గౌరవించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కోరుట్ల లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జరిగిన జయంతోత్సవాల్లో ఆల్ ఇండియా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్త విజయభాస్కర్, పద్మశాలి, మున్నురుకాపు కుల సంఘాల జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, చెదలు సత్తన్నలతో కలిసి పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ కోసం తన మంత్రి పదవిని సైతం తృణపాయంగా వదులుకుని మలిదశ ఉద్యమాన్ని తన ఇంట్లోనే పురుడుపోసి వృద్దాప్యాన్ని జయించి ఉద్యమించిన మహానీయుడు, ప్రజాసంఘాల జేఏసీ అనేక ఉద్యమ కార్యక్రమాల్లో మఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గాంధీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ రత్న ఇవ్వడమే సమచిత స్థానమని పేట భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలిశేట్టి గంగారెడ్డి, జిల్లా దనంజయ్, ఇట్యాల రాజేందర్, అశోక్, నవాబ్, గణేష్ , బుచ్చిరెడ్డి, సంజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button