రాయికల్
ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు

viswatelangana.com
April 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేద మంత్రోచ్చారణాల మధ్య జలాధివాసం ధాన్యాదివాసం వస్త్రాదివాసం పుష్పాదివాసం, హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి, యంత్ర ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి భూమారావు, అర్చకులు శ్రీనివాస్ గ్రామ నాయకులు కొత్త వెంకటి అను పురం గంగాధర్ ముద్దం రమేష్ మక్కల సాయికుమార్ అల్లాల అంజిత్ రమణయ్య అనుపురం సత్యం మహిళలు తదితరులు పాల్గొన్నారు.



