సి.పి.యస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ….

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసి ఆద్వర్యంలో సెప్టెంబర్ -1 పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మినిస్టేడియం నుండి తహశీల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి సి.పి.యస్ వద్దు, ఓ.పి.యస్.ముద్దు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పాల్గొని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావం తెలియజేసారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టీ.జీ.యు.యస్. జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు మాట్లాడుతూ… ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిటి శాపంగా మారిన సి.పి.యస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెన్షన్ ఉద్యోగుల హక్కు అని బిక్ష కాదని అన్నారు. పాత పెన్షన్ తోనే ఉద్యోగులకు సంపూర్ణ బధ్రత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టి.జీ.యు.యస్ జిల్లా శాఖ అధ్యక్షులు నూనావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్, రిటైర్మెంట్ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, ఆర్.యు.పి.పి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్, గెజిటెడ్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్, టీ యన్.జీ.ఓ జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్, ప్రధాన కార్యదర్శి వఖీల్, పి.ఆర్.టి.యు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినిపెల్లి ఆనందరావు, ఎల్.ఎఫ్.ఎల్ జిల్లా బాధ్యులు కొగుల రవి బాబు, ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నకుమల్ల నర్సయ్య, బి.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు శంకర్ బాబు, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



