పోసానిపేటలో వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో బుధవారం వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను అవగాహన పెంచడానికి డీజే వాయిస్ పాటల రూపంలో నాటిక రూపంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. నూతనంగా 32 మంది అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. బడిబాట కార్యక్రమం యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి మరియు పిల్లలు అడ్మిషన్ కావడానికి దోహదపడిన జగిత్యాల జిల్లా సెక్టోరల్ ఆఫీసర్ కొక్కుల రాజేష్, కథలాపూర్ మండల విద్యాధికారి బి. ఆనంద్ రావు, కథలాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు. ఎం అర్జున్, కథలాపూర్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి లోకిని శ్రీనివాస్ తల్లిదండ్రులకు అవగహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధాయులు కృష్ణారావు, జగన్, విజయ్, దుర్గాప్రసాద్, పరంధామ్, వేణుగోపాల్, నజీర్, సులెమన్, వెంకటెశ్వరరావు, ఉపాధ్యాయినీలు, ధనలక్ష్మి, భారతీ, జయలక్షి వాణిశ్రీ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఇంతటి విజయాన్ని చేకూర్చిన వారందరికి పోసాని పేట పాఠశాల ప్రధాసాపాంధ్యాయులు గుండేటి రవికుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకప్పుడు ఏడవ తరగతి వరకు ఉన్న స్కూల్ 4వ తరగతి వరకు పడిపోవడం జరిగిందని ఈ స్కూల్ హెచ్ఎం గుండేటి రవికుమార్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక క్లాస్ పెంచుతూ ఏడవ తరగతి వరకు తిరిగి తీసుకు రావడం జరిగింది. ఇలాగే రవికుమార్ సార్ మా ఊర్లో ఉన్నంతవరకు మా స్కూలు 9వ తరగతి వరకు పెరిగే అవకాశం ఉందని ఇటువంటి ఉపాధ్యాయులు ప్రతి స్కూలుకు అవసరమని రవికుమార్ సార్ కు ధన్యవాదాలు తెలిపారు.



