కోరుట్ల
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
October 13th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదర్శ విద్యాలయం ఉన్నత పాఠశాల 2001 – 2002 పదవ తరగతి విద్యార్థులు ఒకే చోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకే చోట చాలా సంవత్సరాల తర్వాత కలవడంతో ఎంతో ఆనందంగా ఉందని తరగతి గదిలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంట సంతోషంగా గడపడం జరిగిందని పూర్వ విద్యార్థులు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొండబత్తిని కిరణ్, సిరిపురం సాయి, వంగల గిరిబాబు, షికారి అర్జున్, గజం ప్రవీణ్ గుగ్లవత్ అనిల్, పుట్ట అనిల్, సిరిపురం మహిపాల్, పిప్పర రాజేందర్, నీలి శ్రీకాంత్, కలల ఆసన్న, చిలివేరి నవీన్, చేపూరి శ్రావణ్, న్యాయానంది రమేష్, గోనె వంశీ, కొండ్లేపు వంశీ, పిల్లలమర్రి సుమన్, చిలుక సప్త గిరి, రషీద్, తదితరులు పాల్గొన్నారు.



