కథలాపూర్
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

viswatelangana.com
September 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కథలాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ చేనేత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులి హరిప్రసాద్ ప్రజలను కోరారు. వాగులు పొంగిపొర్లి, చెరువులు, కుంటలు నిండుకుండలాగా ఉన్నాయీ, కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వద్దకు పిల్లలు, యువత, జాలర్లు సెల్ఫీ కొరకు, చేపలు, వాగులు, చెరువుల వైపు వెళ్ళొద్దని కోరారు. వర్షానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల దృష్ట్యా కరెంటు స్తంభాల దగ్గరకు ఎవరు వెళ్లకూడదని కోరారు.



