కోరుట్ల

పద్మశాలి వధూవర పరిచయ వేదిక బ్రోచర్ ఆవిష్కరణ

viswatelangana.com

June 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్లలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజున, పద్మశాలి వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పద్మశాలి కళ్యాణ భవన్, కోరుట్లలో జరగనుంది. ఈ వేదికను నిజామాబాద్‌కు చెందిన బొమ్మకంటి తిరుపతి నిర్వహిస్తున్నారు. గత 33 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో పద్మశాలుల వివాహ పరిచయ వేదికలు విజయవంతంగా నిర్వహిస్తున్న బొమ్మకంటి తిరుపతి, ఈసారి 50వ వేదికను మన కోరుట్లలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి వదువరుల వివాహ పరిచయ వేదిక బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కోరుట్ల పట్టణం మరియు పరిసర ప్రాంతాల పద్మశాలి బంధువులు తమ కుమార్తెలు, కుమారుల బయోడేటా సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా పద్మశాలి సంఘ అధ్యక్షులు గుంటుక ప్రసాద్,టి.ఆర్.పి.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, టి.ఆర్.పి.ఎస్ కార్యదర్శి జిల్లా ధనంజయ్, 32వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, సంఘ ఉపాధ్యక్షులు కటుకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందె రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎక్కలదేవి రాంచందర్, కార్యవర్గ సభ్యులు చెన్న శ్రీనివాస్, నల్ల ప్రశాంత్, పడాల గణేష్, గాజుల మధు, యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్ కుమార్, యువత ఉపాధ్యక్షులు బండి సురేష్, బైరి ఆనంద్, సిరిపురం గంగాధర్, సిరిపురం రాజేశ్వర్, రుద్ర సుధాకర్, గోనె శంకర్, మాసం శంకర్, అల్లే లక్ష్మీనారాయణ, వంగరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button