రాయికల్
నిజాయితీ చాటుకున్న జగిత్యాల డిపో మహిళా కండక్టర్

viswatelangana.com
March 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల డిపోకు చెందిన మహిళా కండక్టర్ షబానా బేగం విధులు నిర్వహిస్తున్న బస్ లో దొరికిన బంగారు నగలను ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి తన నిజాయితీ చాటుకున్నారు. రాయికల్ – ఇటిక్యాల బస్సులో ప్రయాణిస్తున్న బిట్ల లక్ష్మి తన తులం నర బంగారు పుస్తెలతాడును బస్సులో పోగొట్టుకున్నారు. అట్టి పుస్తేలతాడు షబానా బేగంకు దొరుకగా బస్ డిపోలో అందించి తన నిజాయితీ చాటుకున్నారు..



