రాయికల్
నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీకి వినతి పత్రం

viswatelangana.com
January 25th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల శివారులోని నివేదిత అనాధ ఆశ్రమం నుండి గుట్ట వెంకటేశ్వర స్వామి ద్వారా సాతారం గుండంపల్లి పొలిమేరు దాకా నాలుగు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు ఉన్నందున వర్షాకాలంలో చాలా ఇబ్బందులు గురి అవుతున్నామని, బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని గ్రామ నాయకులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో గ్రామ నాయకులు కొమ్ముల ఆదిరెడ్డి, నల్ల గంగారెడ్డి, సామల్ల వేణు, మిట్టపల్లి రామిరెడ్డి, కోడిపెల్లి స్వామి రెడ్డి, కొక్కు రాజారెడ్డి, మరిపెల్లీ శ్రీనివాస్ గౌడ్, పుటుకం రాజారెడ్డి, గుజ్జుల నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



