కోరుట్ల

నిబద్దత గల నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

September 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

దేశం ఒక గొప్ప నిబద్దత గల నేతను కోల్పోయిందని ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే అతికొద్ది మంది నాయకులలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఒకరని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు.గురువారం కోరుట్ల సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు, సామాజిక నేత తుల రాజేందర్ రావులతో కలిసి పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ నాయకుడిగా డిల్లీ జె ఎన్ యులో సీతారాం ఏచూరి పోసించిన పాత్ర అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు స్పూర్తిగా నిలిచిందని పార్లమెంట్ సభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడిగా దేశ రాజకీయాలలో లౌకిక వాదం కోసం జీవితాంతం పోరాటం చేసిన నాయకుడన్నారు. దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని నిరంతరం గళం విప్పిన మహా నాయకుడని దేశంలోని పేద ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించడంలో ఏచూరి ముందున్నారని ఆయన లేని లోటు తీర్చరానిదని పేట భాస్కర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతం రాజం, సిపిఐ నేత చెన్న విశ్వనాథం, గ్రంథాలయ అధ్యక్షులు రాస భూమయ్య, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సుతారి రాములు, సిపిఎం జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్, నాయకులు కుంజం శంకర్, ఎం డి మౌలానా, ముఖ్రమ్, రాదక్క, శాంతక్క, షాహిద్ మహ్మద్ షేక్, వంశీ, అలీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button