నిరుద్యోగ రహిత కోరుట్ల నియోజకవర్గంగా చూడటమే నా ప్రధాన లక్ష్యం. -కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

viswatelangana.com
మెట్ పల్లి పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలకు ఎంపికైన నియోజవర్గానికి చెందిన 675 మంది యువతీ యువకులకు స్పాట్లో జాయినింగ్ లెటర్స్ ఇచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 675 మందికి జాయినింగ్ లెటర్స్ ఇవ్వడమే కాకుండా 770 మందిని షార్ట్ లిస్ట్ చేశామని వారికి కూడా త్వరలో జాయినింగ్ లెటర్స్ ఇస్తామని తెలిపారు.ఈరోజు ఉద్యోగం రాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని త్వరలో మరిన్ని కంపెనీల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తానని, నిరుద్యోగ రహిత కోరుట్ల నియోజకవర్గంగా చూడటమే నా ప్రధాన లక్ష్యమని అన్నారు.. జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలన కారణంగా తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు వచ్చాయని, ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయని యువత సమయం వృధా చేయకుండా కష్టపడి ఉద్యోగం సాధించాలని కోరారు. భవిష్యత్ లో యువతకు వ్యాపార అవకాశాల కోసం కూడా ప్రయత్నిస్తానని తెలిపారు.



