కోరుట్ల

నిరుపేదలకు సాయం అందించిన కోరుట్ల వాసవి వనిత క్లబ్

viswatelangana.com

June 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

డాన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఆదివారము రోజు కోరుట్ల పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పట్టణంలోని చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ, నూతన గాంధీ విగ్రహావిష్కరణ, అవయవదానంపై అవగాహన, పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు మరియు ట్రాఫిక్ పోలీస్ లకు మాస్క్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిత్యపూజకు సంబంధించిన పూజ సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ విశిష్ట అతిధులు రీజినల్ చైర్మన్ మహాజన్ జితేందర్ మరియు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ బాల సంతోష్, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎలిమిళ్ళ మనోజ్, జోనల్ చైర్మన్ కొత్త సునీల్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు నీలి బూస మాధురి, కోశాధికారి జంగం మధురిమ, వాసవి సీనియర్ సిటిజన్ సభ్యులు, వాసవి క్లబ్ వనిత క్లబ్ సభ్యులు, వైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి రాజు, వాసవి క్లబ్ ప్రతినిధులు రేగొండ శిరీష్ లింగ రామ్మోహన్, మంచాల రాజలింగం, సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button