రాయికల్
బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

viswatelangana.com
April 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొపెసర్ శ్రీ కొడిమ్యాల భూంరావ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నీగ భూమేశ్వర్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ఉపాధ్యక్షులు గంగాధర్, క్యాషియర్ రాజాం, కార్యదర్శి శంకర్, సంఘ సభ్యులు కొండయ్య, లక్మిరాజం, రాకేష్ దశికుమార్, శేఖర్, శ్రీధర్, శ్రీనివాస్, అజయ్ రాజు పాల్గొన్నారు.



