రోడ్డు, మురుగు కాల్వ, దోమల సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నా కాలనీ.
సిపియం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై బస్తీ బాటలో వెలుగులోకి వాస్తవాలు
viswatelangana.com
కోరుట్ల పట్టణం లోని కెసిఆర్ కాలనీ, నక్కలగుట్ట కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై బస్తీ బాట కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు జి.తిరుపతి నాయక్, సీపీఎం కోరుట్ల కమిటీ సభ్యులు పర్యటించడం జరిగింది. పర్యటనలో ఇక్కడ నివాసముంటున్న నిరుపేద ప్రజలను కలుసుకోని వారి సమస్యలను, ఏదుర్కొంటున్నా ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ కాలనీలోని 86 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 40 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. మిగతా ఇల్లు ఖాళీ ఉన్నాయి, ఇక్కడ మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరంతా ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండటం వల్ల విపరీతమైన దోమలు పెరిగి నరక యాతన అనుభవిస్తున్నారు. సీసీ రోడ్లు సౌకర్యం లేదు. ప్రజలు మురుకు కూపంలో తీవ్ర ఇబ్బందులు పడుతు జీవిస్తున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలే, కుటుంబాలు ఉంటున్న కాలనీలో చాలామందికి రేషన్ కార్డులు లేక, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు రావడం లేదు అలాగే కెసిఆర్ కాలనీలో వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైన పాలకులు, సంబంధిత అధికారులు దళిత వాడ అనే వివక్షను చూపించకుండా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి , సమస్యలను పరిష్కరించాలని సిపియం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మహిపాల్ నాయక్, కోరుట్ల కమిటీ సభ్యులు కుంచం శంకర్, లింగంపల్లి కొండయ్య తదితరులు పాల్గొన్నారు….



