కథలాపూర్
నూతన ఎరువుల గోదాం ప్రారంభించిన ప్రభుత్వ విప్

viswatelangana.com
June 22nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని తాండ్రియాల గ్రామంలో పీఏసీఎస్ గంభీర్ పూర్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాం ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రెండు లక్షల ఏక కాల రుణమాఫీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఆనందంగా ఉందని, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత కరెంట్, వడ్లకు 500 బోనస్ లాంటివి అమలు చేస్తున్నామని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగు నీరు, కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జెడ్పిటీసి నాగం భూమయ్య, వైస్ ఎంపిపి కిరణ్ రావు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, గడీల గంగప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



