నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాం పుర కాలనీలో ఆదివారం రోజున వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్ ఆర్గనైజేషన్ సంఘంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగినది. అధ్యక్షులుగా విశ్వనాథ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మద్దెనపల్లి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా వన తడుపుల వెంకటరమణ, కోశాధికారిగా ఎదులాపురం లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిగా సంకోజు అశోక్, కార్యవర్గ సభ్యులుగా వన తడుపుల నాగరాజు, దొంతి శంకర్, చింతోజీ మురళీ, ఎదురుగట్ల కృష్ణాచారి, వెల్ది నరేష్, రాధరపు గంగాధర్, అందే సురేష్, సంకోజు రవి, వెలిశాల వీర స్వామి, మేడిచెల్మల శ్రీనివాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇట్టి కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టివి సత్యం, ప్రధాన కార్యదర్శి సంకోజు రమణ, అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు చింతల రాజేశ్వర్, మెట్పల్లి అధ్యక్షులు పులిమామిడి చంద్రయ్య, కార్యవర్గం, కోరుట్ల పట్టణ విశ్వబ్రాహ్మణ మనమయ సంఘ అధ్యక్షులు పవన్, 27వ వార్డు కౌన్సిలర్ గుండోజు శ్రీనివాస్, సంఘ సభ్యులు తదితరులు హాజరయ్యారు.



