viswatelangana.com
Date of Publish : 15 April 2025, 1:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నూతన బార్ అసోసియేషన్ కు నియామక పత్రాలు అందజేత

నూతనంగా ఎన్నికైన కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కస్తూరి రమేష్, ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, సంయుక్త కార్యదర్శి చిలువేరి రాజశేఖర్, ట్రెజరర్ చింతకింది ప్రేమ్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శి ఫసియోద్దీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సదానంద నేత, సదాశివ రాజు, జూనియర్ మెంబర్లు నరేందర్, శ్రవణ్య దీప, కార్యవర్గ సభ్యులు మంగళవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఎన్నికల అధికారులు ముబీన్ పాషా, మచ్చ వెంకట రమణ మూర్తి, సంగ విజయ్ సాయి కోరుట్ల కోర్ట్ న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పావని, అతిథిగా కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. జూనియర్ సివిల్ జడ్జి పావని మాట్లాడుతూ…. బార్ మరియు బెంచ్ మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు. కేసులు త్వరగా పరిష్కారరమయ్యేలా న్యాయవాదులు చొరవ తీసుకుని సహకారాన్ని అందించాలన్నారు. అతిథిగా పాల్గొన్న కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ… కోరుట్ల కోర్టులో లైబ్రరీకి నిధులు అందిస్తానని తెలిపారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నూతన కోర్టు భవన నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం మంజూరు చేయించారని అన్నారు. న్యాయవాదులు తోకల రమేశ్, తోకల అలియాస్ రొడ్డ సౌమ్యలు రాజ్యాంగ నిర్మాత భారతరత్న బీమ్ రావు అంబేద్కర్ చిత్రపటాలను న్యాయవాదులకు ముఖ్య అతిథి జడ్జి కాసుల పావని, అతిథి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బార్ ప్రెసిడెంట్ బైరి విజయ్ ద్వారా న్యాయవాదులందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బద్ది నర్సయ్య, తన్నిర్ శ్రీనివాస్ రావు, సుతారి నవీన్, వనపర్తి క్రాంతి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Change News Type