రాయికల్
ఆకస్మిక తనిఖీ కలెక్టర్ బి సత్యప్రసాద్

viswatelangana.com
December 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమగ్ర ఇంటింటి సర్వే డాటా ఎంట్రీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆన్లైన్లో నమోదు చేసిన ఎంట్రీ డేటాను పరిశీలించారు. అనంతరం వార్డుల వారీగా పకడ్బందీగా ఆన్లైన్లో తప్పులు లేకుండా నమోదు ప్రక్రియ చేయాలని ఆదేశించారు. అలాగే వార్డు లో ఉండవలసిన డాటా కంటే ఎక్కువ మంది నమోదు అయినట్లయితే జాబితాను మళ్లీ యధావిధిగా వార్డు వారిగా సరి చేసి ఈరోజు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంపీఓ, మండల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



