నూలు డిపో ఏర్పాటుకై 50 కోట్లు కేటాయింపు

viswatelangana.com
వేములవాడ కేంద్రంగా యారన్(నూలు) డిపోను ఏర్పాటు చేసి.. రూ .50 కోట్ల నిధులను కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్కకు అందుకు కృషి చేసిన మంత్రులు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కి, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కథలపూర్ పద్మశాలి సంఘాల తరఫున ఆదివారం కృతజ్ఞతలు తెలిపి.. కథలపూర్ మండల కేంద్రంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సోదరులు మాట్లాడుతూ యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుందని తెలిపారు. వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని సుమారు 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనున్నదని, చెప్పారు. యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా వారికి ఉపాధి లభిస్తుందన్నారు. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలును టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ కృతజ్ఞత పాలాభిషేక కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి పులి హరి ప్రసాద్, కథలపూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుండేటి సురేష్, మండల ప్రధాన కార్యదర్శి వంగరి రాజారాం,కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, చెదలు సత్యనారాయణ, లింగరావు,రమేష్ యాదవ్,కట్ట శంకర్, కరపు గంగాధర్, చిలుక అశోక్ బండి నరేష్,సామల్ల మోహన్, వాసాల రాజు, వాసాల మహేష్, మర్రి ప్రసాద్, వాసం నరేందర్, వాసం రాజు, వాసం శ్రీనివాస్ తో పాటు, పద్మశాలి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని తమ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.



