కోరుట్ల
గుంలాపూర్ వెంకటేశ్వర స్వామి జాతర
viswatelangana.com
February 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు జాతరలో అన్నదానం కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్యగౌడ్ -గంగు మరియు గడ్డం నవీన్ గౌడ్- ఆమని దంపతులు చేశారు. వెంకటేశ్వర ట్రస్ట్ సేవ సమితి సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు జాతరలో సేవా కార్యక్రమాలు చేసారు. జాతరలో జరిగిన రథోత్సవం లో నాయకులు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు



