కోరుట్ల
శ్రీదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదానం

viswatelangana.com
October 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఎనిమిదవ రోజు శ్రీ మహా చండి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా అమ్మవారి సన్నిధానంలో దేవి నిత్య పూజ, కుంకుమార్చన, మహా చండీయాగం, విశేష పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మహా చండీ యాగ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో శ్రీ దుర్గా సేవా సమితి సభ్యులు, మాలధారణ స్వాములు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.



