కోరుట్ల

యూసుఫ్ నగర్ లో సబ్సిడీ సిలిండర్ ప్రొసీడింగ్ పంపిణి చేసిన జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com

September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా 5 వందల రూపాయలకే సిలిండర్ కు సంబంధించిన ప్రొసీడింగులను పంపిణీ చేసిన, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగ్ రావు. ఈ సందర్భంగా నర్సింగ్ రావుని పూలమాల మరియు శాలువాతో ఘనంగా సన్మానించిన మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ ప్రియాంక సురేష్ గౌడ్, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సింగ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకుందన్నారు. అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు. సన్నారకం వడ్లు పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఈ పంట నుండే ఇస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం సైతం రోడ్లు అలాగే ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ గుగ్గిల్ల ప్రియాంక సురేష్ గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముక్కర లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు గోపు సురేష్, శంకర్, గోవర్ధన్, రేషన్ డీలర్లు సత్యనారాయణ, మురళి అలాగే మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button