
viswatelangana.com
ఉమ్మడికరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి ఈ సందర్భంగా మాట్లాడుతూ… అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన శ్రీ మల్కా కొమురయ్య మరియు చిన్నమైల్ అంజిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, కుర్మా మల్లరెడ్డి, మచ్చ నారాయణ, గోపాల్ జి,రాజారెడ్డి, సమల్ల సతీష్, బన్న సంజీవ్, కున్నారపు భూమేష్, సింగం సతీష్, కడార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



