కోరుట్ల

పదవ తరగతి ఫలితాల్లో జోగన్ పల్లి ప్రభుత్వ పాఠశాలను మండల స్థాయిలో నిలపాలి

viswatelangana.com

March 11th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
  • ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మొదలవుతున్న సందర్భంగా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామం లోని సోమవారం రోజున జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని , విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎగ్జామ్ ప్యాడ్ లు,పెన్నులు ను కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. రానున్న పరీక్షల్లో అత్యధిక మార్కులతో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, జోగన్ పల్లి ని మండలం లో అగ్రగామిగా నిలపాలని తెలుపుతూ, విద్యార్థులందరికీ పరీక్షల గురించి దిశనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రజం, అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిట్కు సహదేవ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతావేని శేఖర్, సైదు గంగాధర్, ఇంద్రాల హరీష్, నక్క నర్సయ్య, ఇంద్రాల అశోక్, ముత్యపు రాజశేఖర్, కొమ్ము శ్యామ్ కుమార్, తేలు సత్యం, తేలు శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button