పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని పి.బి. గార్డెన్స్ లో లిటిల్ జీనియస్ హై స్కూలులో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు వీడ్కోలు పార్టీని నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ బండి మహాదేవ్ అధ్యక్షతన నిర్వహించబడిన ఈకార్యక్రమానికి కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్రమశిక్షణతో మంచి చదువు, దానితో ఉన్నత స్థానాన్ని పొందాలని క్రమశిక్షణతో ప్రణాళికతో జీవితాన్ని దిద్దుకోవాలని అన్నారు.ముఖ్య అతిథిగా డాక్టర్ స్వీతి అనూప్ రావు మాట్లాడుతూ… ఉన్నత విలువలు కలిగిన జీవితం ఉన్నత స్థానాన్ని స్థాయిని అందిస్తుందని దానికోసం నిరంతరం శ్రమించాలని చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకోవడమే మార్గమని అన్నారు. పాఠశాల పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ యూసుఫ్ అలీ మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంచుకొని థామస్ ఎడిషన్ బల్బును కనుగొనకపోతే మనం ఈరోజు చీకట్లో ఉండేవారిమని అలా చిన్ననాటి నుండే పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త విషయాలను కనుగొనాలని మంచి సైంటిస్టులు కావాలని అన్నారు.



