కోరుట్ల
పది ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం
viswatelangana.com
April 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం సాయిరాంపుర కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో గత పది సంవత్సరాలుగా పట్టణంలో ప్రథమ స్థానంలో ఉంది. ఈసారి కూడా కే. శ్రీజ 10 జీపీఏ, శ్రీ అక్షర 10 జిపిఏ, ఆయేషా ఫిర్దోస్ 10 జీపీఏ, సాత్విక 9.8, సుమేరా ఫిర్దోస్ 9.8, జియావుద్దీన్ 9.8, 9 మరియు ఆపై జిపిఏ 30 మంది విద్యార్థులు సాధించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ ఈ ఫలితాలకు టెన్త్ రివిజన్ ప్రోగ్రాం టెక్నో కరికులం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య, చైర్మన్ శ్రీధర్, ఏజీఎం రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ శివ కోటేశ్వరరావు, అకాడమిక్ డీన్ రాజా, సి బ్యాచ్ ఇంచార్జ్ అనిల్, పదోతరగతి ఇంచార్జ్ నరహరి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



