ఉప్పుమడుగు సహకార సంఘం కార్యదర్శి పై వేటు.

viswatelangana.com
ధాన్యం కొనుగోళ్లలో అంశంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పు మడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి తిరుపతి ని సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంఘం పాలక వర్గానికి ఆయన ఆదేశాలు జారీచేశారు. ఉప్పుమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు కు సంబంధించి హమాలీలను ఏర్పాటు చేయకపోవడం తో వీరాపుర్ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లో వీరాపుర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్,రాయికల్ తహసీల్దార్ ఖయ్యూం,డి టీ గణేష్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయి కుమార్ లు గురువారం సందర్శించి ధాన్యం కొనుగోళ్లు చేపడతామని తెలిపారు.



