రాయికల్
జాతీయ మహిళా ఐకాన్ అవార్డు అందుకున్న అల్లే వనిత

viswatelangana.com
March 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
తక్కువ కాలంలోనే మహిళ న్యాయవాది గా మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ, న్యాయ రంగంలో రాణిస్తున్న జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన అల్లే వనిత ను లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ ఉమెన్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేసారు. ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ లో జరిగిన అవార్డు స్వీకరణ సమావేశంలో ఆమె అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు నక్క అశోక్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించి ప్రతిభ కనబరచడం, నేటి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన న్యాయవాది వనిత కు ఈ అవార్డు దక్కడం అభినందనీయం అని, ఎందరో మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని విద్య, వైద్య వ్యాపార, వృత్తి, మరియు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు.



