విద్యార్థుల ప్రగతే దేశ ప్రగతి

viswatelangana.com
మండలంలోని తూర్తి ప్రాథమిక పాఠశాల ఆవరణంలోని పిల్లల యొక్క బావి భవిష్యత్తును పిల్లల చేతిలొ మరియు తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది పాఠశాల ఆవరణంలోని పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అంబర్పేట జడ్.పి.హెచ్.ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం కిషన్ రావు మాట్లాడుతూ. పిల్లల యొక్క పెంపకం తల్లిదండ్రులపై ఉంటుంది విద్యార్థుల విద్యను అందించేటటువంటి విద్యను ఉపాధ్యాయుల చేత ఉంటుంది ఈ రెండు ప్రతి విద్యార్థికి సరైన సమయంలో అందించినట్లు అయితే పిల్లవాడి చదువు బావి భవిష్యత్తును దారితీస్తుంది మేజర్ గా పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలపై బడికి పంపకపోవడం అశ్రద్ధగా చూడటం జరుగుతుంది నెలలో పది రోజులు కూడా బడికి రానటువంటి పరిస్థితి. దీని గురించి పిల్లల యొక్క తల్లిదండ్రులకు చర్చిస్తూ క్రమంలో తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాధానం మేరకు సరైన సమయానికి బస్సు రాకపోవడం వలనే మా పిల్లలు పాఠశాలకు రావడం లేదు అని సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ. పిల్లలు ఎక్కువ ఫోన్లపై మద్యపానానికి అలవాట్లు పడి చెడు అలవాట్లకు దగ్గరై చదువుపై అశ్రద్ధ చూపి పాఠశాలకు రావటం లేదు . తల్లిదండ్రులు పిల్లల విద్య పట్ల శ్రద్ధ వహించాలి అని కోరారు ఈనెల 15వ తారీకు నుండి ఒంటి పూట బడి ప్రారంభం కానున్నాయి అదేవిధంగా 18 తారీకు నుండి పదవతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల తరఫున డిపో మేనేజర్ కు సరైన సమయానికి బస్సు సౌకర్యం కొరకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు



