కోరుట్ల

పరిసరాల పరిశుభ్రంగా ఉంచుదాం సీజన్ వ్యాధులను తరిమికొడదాం

-16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి

viswatelangana.com

September 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం.. సీజన్ వ్యాధులను తరిమికొడదామని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి వార్డు ప్రజలను కోరారు. శనివారం స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా వార్డులోని మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ ను మున్సిపల్ సిబ్బంది చల్లారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ… ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అదేవిధంగా డ్రమ్ములు, టైర్లు, కొబ్బరి బొండాలలో నీరు ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, ప్రతి ఒక్కరు గోరువెచ్చగా వేడి చేసిన నీటిని తాగాలని అన్నారు. చెత్తను రోడ్డుపైన, మురికి కాలువలో వేయకూడదని చెత్త బండికి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, జవాన్ రాజ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button