
viswatelangana.com
కోరుట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలందరు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, అప్పుడే పరిశుభ్రంగా చెత్త రహిత నగరంగా ఉంటుందని కమిషనర్ మారుతి ప్రసాద్ పేర్కొన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గురువారం తడి, పొడి చెత్త పై పలు వార్డు లలో ప్రత్యేక డ్రైవ్ చేసి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చెత్తను తొలగించి, డ్రైనేజీ లను శుబ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ… సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటు ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలను తొలగించి, నీటి మట్టల్లో క్లోరినేషన్ పరీక్షలు చేయించినట్లు చెప్పారు. అంతే కాకుండా 3వ వార్డు డ్రైనేజీ లను శుభ్రం చేయించమన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, తడి, పొడి చేతను వేరు చేసి, చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లో మాత్రమే వెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, అశోక్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



