రాయికల్
టి యు జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ఈదుల లక్ష్మణ్ నియామకం
viswatelangana.com
March 18th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ కు చెందిన ఈదుల లక్ష్మణ్ ను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి. సెక్రటరీ జనరల్ ప్రపులు రామ్ రెడ్డి, చంద్రన్న ప్రసాద్ గార్ల ఆదేశాల మేరకు నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భోగి పద్మ తదితరులు పాల్గొన్నారు.



